జిల్లాలోని విజయనగరం, శృంగవరపుకోట, సాలూరు, పార్వతీపురంలో ఆర్టీసీ బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. ప్రైవేటు విద్యాసంస్థలు, వాణిజ్య, వ్యాపార వర్గాలు స్వచ్ఛందా బంద్ కు మద్ధతు తెలిపారు.
కమిటీలతో కలసి మానవహారం..
జిల్లా కేంద్రం విజయనగరంలో ఉదయం 6 గంటలకే ఆర్టీటీసీ బస్టాండ్ వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ, రైతు సంఘాలు భారత్ బంద్ సందర్భంగా.. ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. సాగు చట్టాలు, విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం మొండి వైఖరీని నిరసిస్తూ నినదించారు. భారత్ బంద్ కు మద్ధతుగా.. విజయనగరం ఆర్టీసీ డిపో ఉద్యోగులు సైతం నిరసన తెలియజేశారు. డిపో ముందు జెండాలు చేతబూని వామపక్షాలు, రైతు సంఘాలు, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి మద్ధతు ప్రకటించారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పీడబ్ల్యుడీ మార్కెట్ కార్మికులు.. మార్కెట్ నుంచి గంట స్తంభం వరకు భారీ నిరసన ర్యాలీ చేశారు. అనంతరం వామపక్షాలు, రైతు సంఘాలు, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీతో కలసి మానవహారం నిర్వహించారు.
రహదారి దిగ్బంధం..
సాలూరులో వామపక్షాలు నిరసన ర్యాలీ చేపట్టారు. బలిజిపేటలో బంద్ సందర్భంగా విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కమిటీ రహదారి దిగ్బందం చేసింది. తెర్లాంలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ర్యాలీ చేశారు. జియ్యమ్మవలసలో సీపీఎం కేంద్ర ప్రభుత్వ తీరుని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. పాచిపెంటలో సీపీఎం, గిరిజన సంఘాలు రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేశారు. సీతానగరంలో తెదేపా, వైకాపా, వామపక్షాలు సంయుక్తంగా రహదారి దిగ్బంధంలో పాల్గొన్నారు.
నిలిచిన వాహనాలు..
కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన మూడు వ్యవసాయ బిల్లులు రద్దు చేయాలని విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటుపరం ఆలోచన మానుకోవాలని భారత్ బంద్ పాటిస్తున్న ప్రజా సంఘ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టీసీ కూడలి వద్ద ఉదయం నుంచి రోడ్డుపై బైఠాయించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. పార్వతీపురం ఆర్టీసీ కూడళ్ల వద్ద భారత్ బంద్ పాటిస్తున్న ప్రజా సంఘ తెదేపా నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నాయకులు రోడ్డుపై బైఠాయించారు. వ్యవసాయం మూడు బిల్లు లను రద్దు చేయాలని, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విరమించుకోవాలని కోరుతూ దేశ వ్యాప్త బంద్‌లో భాగంగా పాఠశాలలు, దుకాణాలు మూతపడ్డాయి. నాయకులు గంటల తరబడి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలపటంతో.. ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.
ఇవీ చూడండి..