మాన్సాస్ ట్రస్ట్ కార్యకలాపాలపై.. విజయనగరంలోని ట్రస్ట్ ప్రధాన కార్యాలయంలో ఆడిటింగ్ మొదలైంది. జిల్లా ఆడిట్ అధికారి హిమబిందు ఆధ్వర్యంలో ఆడిటింగ్ జరుగుతోంది. మాన్సాస్ ట్రస్టులో 16 ఏళ్ల తర్వాత ఆడిట్ జరుగుతున్నందున సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సిద్ధంగా ఉన్నాం
ఆడిట్‌కు సిద్ధంగా ఉన్నాం. రికార్డులన్నీ అందుబాటులో ఉంచాం. ముందుగా హార్డ్ కాపీలను అందజేశాం. సోమవారం నుంచి ఆడిట్ నిర్వహిస్తామని సమాచారమిచ్చారు. ఆడిట్ జరిగితే లోపాలుంటే బయటపడతాయి. సరిదిద్దుకునే అవకాశం కలుగుతుంది.
- డి.వెంకటేశ్వరరావు, కార్యనిర్వహణాధికారి, మాన్సాస్ ట్రస్టు.
లెక్కలు తేల్చాల్సినవి
దేవాలయాలు - 105
భూములు- 14,421.99 (ఎకరాలు)
విద్యాసంస్థలు- 13
ఇదీ చదవండి: తెలంగాణ విద్యుదుత్పత్తిపై హైకోర్టుకు ఏపీ రైతులు