ETV Bharat / state

'ప్రభుత్వ నిర్ణయంతో అనేక ఉద్యోగాలు పోతాయి' - తెదేపా నేత అశోక్ గజపతి రాజు వార్తలు

భోగాపురం విమానాశ్రయాన్ని గత ప్రభుత్వం అనుకున్నదాని కంటే తక్కువ ఎకరాల్లో నిర్మించాలనుకోవడంపై మాజీ ఎంపీ, తెదేపా నేత అశోక్‌గజపతిరాజు తప్పుబట్టారు. దీనివల్ల ఎన్నో ఉద్యోగాలు పోతాయని, భావితరాల వారు ఇబ్బంది పడాల్సి వస్తుందని అన్నారు.

ashok gajapati raju
ashok gajapati raju
author img

By

Published : Jun 13, 2020, 1:02 PM IST

విజయనగరం జిల్లాలో భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని కుదించటంపై తెదేపా సీనియర్ నేత అశోక్ గజపతి రాజు మండిపడ్డారు. భోగాపురం విమానాశ్రయాన్ని నిర్వీర్యం చేసేందుకు వైకాపా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సర్కార్ నిర్ణయం వల్ల ఉత్తరాంధ్ర ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి స్థలాన్ని ఎందుకు తగ్గించారో ప్రజలకు ప్రభుత్వం చెప్పాలి. భోగాపురం విమానాశ్రయ నిర్మాణంలో తాజా సవరణలతో అనేక ఉద్యోగాలు పోతాయి. ఉద్యోగ అవకాశాలు, అభివృద్ధి పెరగాలంటే గతంలో డిజైన్ చేసిన ప్రాజెక్టును కొనసాగించాలి -అశోక్ గజపతిరాజు

భోగాపురం విమానాశ్రయానికి గత ప్రభుత్వం 2,700 ఎకరాలు కేటాయించింది. అయితే దానిని 2,200 ఎకరాలకు తగ్గించింది వైకాపా ప్రభుత్వం. ఆ విస్తీర్ణంలోనే విమానాశ్రయ నిర్మాణానికి జీఎంఆర్ సంస్థతో అంగీకారం చేసుకుంది. మిగిలిన 500 ఎకరాల ద్వారా రూ.1,500 కోట్లు ప్రభుత్వానికి ఆదా అవుతుందని ప్రభుత్వం చెబుతోంది.

ఇదీ చదవండి

జగన్​ను కంట్రోల్ చేసేది చంద్రబాబే: జేసీ దివాకర్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.