Mansas trust chairman Ashok Gajapathi Raju: మాన్సస్ ట్రస్టు స్థలం విషయంలో జరిగిన వ్యవహారాన్ని ఆ సంస్థ ఛైర్మన్ అశోక్ గజపతిరాజు ఖండించారు. మాన్సన్ స్థలాన్ని కొలతలు వేయటానికి.. బుల్డోజర్ ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించిన ఆయన.. మాన్సస్ స్థలాలపై దౌర్జన్యం చేసే ముందు, ప్రొసీజర్ ఫాలో కావాలని హితవు పలికారు. సంస్థకు చెందిన భూముల ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై కేసులు ఎందుకు పెట్టడం లేదని ఈవోను ప్రశ్నించారు. ఈ మేరకు విజయనగరంలో మీడియాతో మాట్లాడారు.
Ashok Gajapathi Raju Fire on Mansas trust Eo: 'ఈ వ్యవహారంపై కేసు పెట్టకుండా.. జిల్లా కలెక్టర్, ఎస్సీలకు ఈవో లేఖలు రాస్తున్నారు. ఛైర్మన్‌గా ఉన్న నాపై గతంలో చేయని తప్పుకు కేసు పెట్టిన ఈవో.. ఇప్పుడెందుకు ఆ పని చేయడం లేదు? మాన్సస్ ఈవో బై లాస్ ప్రకారం నడుచుకోవడం లేదు. ఈవోపై న్యాయధిక్కరణ కింద కోర్టును ఆశ్రయిస్తా. ఇప్పటికైనా ఈవో తమ విధులను సక్రమంగా పాటించాలి.' అని ఆయన కోరారు. గతంలో మాన్సస్ ట్రస్టు ఆస్తుల పూర్తి సమాచారం కావాలని ఎమ్మెల్యే కోలగట్ల లేఖ ద్వారా అడిగారని.. వాళ్లు దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆస్తులపై పడటం విడ్డురంగా ఉందన్నారు.
ఆలయ అనువంశిక ధర్మకర్తలపై ప్రభుత్వం వేధింపులకు దిగుతోందని.. మాన్సస్ ఆడిట్ వ్యవహారంలో అధికారులు నిబంధనలు పాటించలేదని వ్యాఖ్యానించారు. ఆడిట్లో అంశాలను ఇప్పటివరకు తనకు తెలియదన్నారు. బడ్జెట్‌పై సమీక్ష కోసం కూడా మాన్సస్ ఈవో సమయం ఇవ్వడం లేదన్నారు.
మురళీమోహన్‌కు చెందిన జయభేరి సంస్థ నిబంధనల ప్రకారమే మాన్సస్ స్థలం లీజుకు తీసుకుందని, తమ హయాంలో మురళీమోహన్‌కు ఇస్తే.. ఇప్పుడు వైకాపా ప్రభుత్వం ఎందుకు రెన్యూవల్ చేసిందని ప్రశ్నించారు.
ఇదీ చదవండి..
PRC: ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం పిలుపు.. కాసేపట్లో పీఆర్సీ ప్రకటన!