ETV Bharat / state

రామతీర్థంలో ఆలయం ప్రారంభోత్సవం.. నా ఆధ్వర్యంలోనే జరగాలి: అశోక్​ గజపతి రాజు - Ashok Respond press meet on Ramatheertham New Temple

Ashok Gajapathi Raju News: రామతీర్థం నిలచలం కొండపై నూతన ఆలయం ప్రారంభోత్సవం ట్రస్ట్ ఛైర్మన్​గా తన ఆధ్వర్యంలోనే జరగాలని మాన్సాస్​ ట్రస్ట్​ ఛైర్మన్​ అశోక్​ గజపతి రాజు హితవు పలికారు. తనకు నచ్చినప్పుడు రామతీర్థం వెళ్లి దర్శనం చేసుకుంటా... తనను ఎవరూ ఆపలేరని ఆయన స్పష్టం చేశారు.

Ashok Gajapathi Raju
Ashok Gajapathi Raju
author img

By

Published : Apr 24, 2022, 12:40 AM IST

Updated : Apr 24, 2022, 6:18 AM IST

Ramatheertham New Temple: రామతీర్థం నిలచలం కొండపై రాములు వారి నూతన ఆలయం ప్రారంభోత్సవంపై మాన్సాస్​ ట్రస్ట్​ ఛైర్మన్​ అశోక్​ గజపతి రాజు స్పందించారు. కొండపై ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ట్రస్ట్ ఛైర్మన్​గా తన ఆధ్వర్యంలోనే జరగాలని గజపతిరాజు హితవుపలికారు. విజయనగరంలోని అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై వ్యాఖ్యాలు చేశారు. ఈ సర్కార్.. తన​ మీద పెట్టిన అక్రమ కేసుల విషయంలో హైకోర్టు చుట్టూ తిరగడానికే తనకు సరిపోతుందన్నారు.

'నాకు ప్రోటోకాల్ ఇవ్వడానికి రామతీర్థం ఈవోకి భయపడుతున్నారు. కానీ నాకు ఎవరి అనుమతి అవసరం లేదు. నేను రామతీర్థం ఎప్పుడు వెళ్తాను అనేది నా ఇష్టం. నాకు నచ్చినప్పుడు వెళ్లి దర్శనం చేసుకుంటా. నన్ను ఎవరూ ఆపలేరు. పాత దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. అసలు దేవాదాయ శాఖ మంత్రిగానే పనికిరాను అని ఆయనే రుజువు చేసుకున్నారు. కొత్తగా వచ్చిన మంత్రి అయినా రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తారని ఆశిస్తున్నా. ప్రభుత్వం రామతీర్థం విషయంలో నాపై రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తించలేదా ?. కానీ.. ఇలాంటి చర్యలు ఏ ప్రభుత్వానికి తగవు' అని గజపతిరాజు హితవు పలికారు.

ఇదీ చదవండి: "ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాల్లో ఆధార్​ ఆధారిత బయోమెట్రిక్ హాజరు"

Last Updated : Apr 24, 2022, 6:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.