'ప్రతిపక్ష నేతను అడ్డుకోవడం ఎంత వరకు సబబు?' - చంద్రబాబు విశాఖ పర్యటనపై అశోక్ గజపతి రాజు
ప్రతిపక్ష నేతకు స్వేచ్ఛను కల్పించాల్సిన ప్రభుత్వమే... అడ్డుపడుతుండటం దారుణమని మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. ప్రతిపక్ష నేతను ప్రజల మధ్యకు వెళ్లనీయకుండా అడ్డుకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. అక్రమాలు ఎక్కడ జరిగినా, అక్కడకు వెళ్లి ప్రజలను కలవడం ప్రతిపక్ష నేత హక్కు అని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతపై కోడిగుడ్లు, చెప్పులు వేయడం మంచి పద్ధతి కాదని వ్యాఖ్యానించారు. అమరావతి రైతుల త్యాగాలను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.