విజయనగరం జిల్లాలలో అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాన్ రంభ వెంకట నాయుడు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో పూర్తిచేశారు. జియ్యమ్మవలస మండలంలోని అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. 2001లో ఆర్మీలో జవాన్‌గా విధుల్లో చేరిన వెంకట నాయుడు.. దేశంలో పలుచోట్ల విధులు నిర్వహించారు. ప్రస్తుతం అస్సాంలో హవాల్ధర్గా విధులు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కలకత్తాలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెంకటనాయుడు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్.కూర్మనాథ్, సబ్ కలెక్టర్ వెంకటేశ్వర రావు, డీఎస్పీ సుభాష్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
అధికార లాంఛనాలతో ఆర్మీ ఉద్యోగికి అశ్రునివాలి.. - vizianagaram latest news
అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాన్ రంభ వెంకట నాయుడు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించారు. సొంత గ్రామం జియ్యమ్మవలసలో నిర్వహించిన అంతిమ సంస్కారాలకు ఆర్మీ జిల్లా అధికారులు పాల్గొన్నారు.

విజయనగరం జిల్లాలలో అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాన్ రంభ వెంకట నాయుడు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో పూర్తిచేశారు. జియ్యమ్మవలస మండలంలోని అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. 2001లో ఆర్మీలో జవాన్‌గా విధుల్లో చేరిన వెంకట నాయుడు.. దేశంలో పలుచోట్ల విధులు నిర్వహించారు. ప్రస్తుతం అస్సాంలో హవాల్ధర్గా విధులు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కలకత్తాలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెంకటనాయుడు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్.కూర్మనాథ్, సబ్ కలెక్టర్ వెంకటేశ్వర రావు, డీఎస్పీ సుభాష్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
Chandrababu: 'ఫ్యాక్షనిజం పోకడలతో ఏం సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు?'
అపెక్స్ కౌన్సిల్లో అవినీతి జరుగుతోంది: అజహర్