ETV Bharat / state

జీవీఎంసీ వార్డుల పునర్విభజన తుది గెజిట్ నోటిఫికేషన్ పై హైకోర్టులో వాదనలు - జీవీఎంసీ వార్డుల పునర్విభజన

జీవీఎంసీ వార్డుల పునర్విభజన తుది గెజిట్ నోటిఫికేషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఫిబ్రవరి 3న జీవీఎంసీ వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రచురణ చేయాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ పదవిని మొదట ఎస్సీ మహిళకు కేటాయించి.. తర్వాత అన్ రిజర్వుడ్ గా మార్చడాన్ని సవాలుచేస్తూ హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలైంది .

హైకోర్టులో వాదనలు
హైకోర్టులో వాదనలు
author img

By

Published : Jan 30, 2020, 10:35 PM IST

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల పునర్విభజనపై ఈనెల 24న జారీచేసిన తుది గెజిట్ నోటిఫికేషన్ ను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్​పై న్యాయస్థానం విచారణ జరిపింది. ఫిబ్రవరి 3న జీవీఎంసీ వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రచురణ చేయాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వార్డుల రిజర్వేషన్ల ఖరారు నాలుగు రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఆ ప్రక్రియ పూర్తయ్యాక ఎన్నికల ప్రకటన జారీచేసేందుకు వివరాల్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపనున్నట్లు స్పష్టం చేసింది.

గెజిట్ నోటిఫికేషన్​ను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వం గడువు కోరింది. అందుకు అంగీకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం . సత్యనారాయణమూర్తి... విచారణను సోమవారానికి వాయిదా వేస్తూ ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశించారు. దాఖలు చేయడంలో విఫలమైతే తగిన ఆదేశాలు ఇస్తామని తేల్చిచెప్పారు .

విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ రిజర్వేషన్​పై మరో వ్యాజ్యం

విజయనగరం జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్ పదవిని మొదట ఎస్సీ మహిళకు కేటాయించి.. తర్వాత అన్ రిజర్వుడ్ గా మార్చడాన్ని సవాలుచేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. జిల్లాకు చెందిన బి. లక్ష్మి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు . 2020 జనవరి 3న జారీచేసిన నోటిఫికేషన్ ప్రకారం జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ పోస్టు ఎస్సీ మహిళకు, శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ స్థానం అన్ రిజర్వ్ కు కేటాయించారు.

గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ను సవరించి జనవరి 8న మరొకటి జారీ చేస్తూ విజయనగరం సీటును అన్ రిజర్వుడ్, శ్రీకాకుళం సీటును ఎస్సీ మహిళగా పేర్కొన్నారు . పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 181 ప్రకారం గతంలో కేటాయించిన రిజర్వు సీటును రొటేట్ చేయాల్సిన అవసరం ఉందని పిటిషనర్ పేర్కొన్నారు . అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి జోక్యంతో విజయనగరం సీటును అన్ రిజర్వుడ్​గా మార్చారన్నారు . ఈ వివరాల్ని పరిగణనలోకి తీసుకొని సవరణ నోటిఫికేషన్​ను రద్దుచేయండి అని వ్యాజ్యంలో కోరారు .

ఇదీచదవండి ఇద్దరు మంత్రుల పోర్టుఫోలియోలో మార్పులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.