విజయనగరం జిల్లా గుర్ల మండలం చింతపల్లిపేటలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 4కోళ్లఫారం షెడ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. షెడ్లతోపాటు అందులోని 8వేల కోళ్లు కాలిపోయాయి. ఈ దుర్ఘటనతో సుమారు 30లక్షల రూపాయల వరకు అస్తి నష్టం వాటిల్లింది. నిన్న సాయంత్రం 4గంటల సమయంలో ఒక షెడ్డులో షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు పెద్దఎత్తున చెలరేగి ఒకదాని తర్వాత ఒకటి 4షెడ్లకూ మంటలు వ్యాపించాయి. మంటలను అదుపు చేసే లోపు., షెడ్లు మొత్తం కాలిబూడదయ్యాయి.
ఇవీ చదవండి