పోలీస్ స్టేషనుకు రాకుండా పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ సేవలను అందించేందుకు ఏపీ పోలీసు సేవ సిటిజన్ సర్వీసు అప్లికేషన్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విజయనగరం జిల్లా ఎస్పీ బి. రాజకుమారి, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ యాప్ ద్వారా ఇంటి వద్దకే 87 పోలీస్ సేవలు అందించేలా చర్యలు చేపట్టింది. మహిళలు తమ ఇంటి నుంచే మొబైల్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నందున, స్వేచ్చగా, ఎలాంటి సంకోచం లేకుండా తమ బాధలు తెలుపుకొనే అవకాశం లభిస్తుందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ యాప్ గురించి ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పిస్తామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి...