మాన్సాస్ ట్రస్టుపై ప్రభుత్వ అప్పీల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా పడింది. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్‌పర్సన్ నియామక జీవోను కొట్టివేస్తూ.. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లింది. హైకోర్టు డివిజన్ బెంచ్‌లో రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ వేసింది. మరికొన్ని పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. అన్ని పిటిషన్లు కలిపి విచారణ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. విచారణ 2 వారాలపాటు వాయిదా వేసింది.
సంచయిత గజపతిరాజును ఛైర్‌పర్సన్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా పునర్నియమించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం అశోక్ గజపతిరాజును మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.
ఇదీ చదవండి: