ETV Bharat / state

'రైతు భరోసా కేంద్రాల్లో ఆరుగురు రైతులతో ఒక సంఘం' - vizainagaram latest news

ప్ర‌తీ రైతు భ‌రోసా కేంద్రం ప‌రిధిలో ఆరుగురు రైతుల‌తో ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాల‌ని వ్య‌వ‌సాయ‌శాఖ క‌మిష‌న‌ర్ హ‌నుమంతు అరుణ్‌కుమార్ ఆదేశించారు. ఆగస్టు 20వ తేదీలోగా ఈ సంఘాల్ని ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు.

'An association with six farmers in raithu bharosa kendram
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అధికారులు
author img

By

Published : Aug 5, 2020, 12:01 AM IST

వివిధ జిల్లాల వ్యవసాయశాఖ అధికారులు, సహకారశాఖ అధికారులు, తహసీల్దార్లతో వ్యవసాయశాఖ కమిషనర్ హనుమంతు అరుణ్​కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రతి రైతు భరోసా కేంద్రం పరిధిలో ఆరుగురు రైతులతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఆగస్టు 20వ తేదీలోగా గ్రూపులను ఏర్పాటు చేసి సెప్టెంబర్ 15వ తేదీలోగా శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు. ప్రతి గ్రూపులో మంచి నడవడిక కలిగిన ఆరుగురు రైతులను చేర్చాలన్న ఆయన ఈ గ్రూపుల ఆద్వర్యంలోనే క‌స్ట‌మ్ హైరింగ్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసి, ఆయా గ్రామాల రైతుల‌కు వ్య‌వ‌సాయ‌ యంత్ర ప‌రిక‌రాల‌ను అద్దె ప్రాతిప‌దిక‌న‌ స‌ర‌ఫ‌రా చేయ‌డం జ‌రుగుతుంద‌ని అన్నారు.

ఆయా గ్రామాల వ్య‌వ‌సాయ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి, వారికి ఏయే ప‌రిక‌రాలు అవ‌స‌ర‌మో ఈ గ్రూపు నిర్ణ‌యిస్తుంద‌ని, ప్ర‌భుత్వం 40 శాతం రుణాన్ని స‌మ‌కూరుస్తుంద‌ని చెప్పారు. ఈ గ్రూపుల‌కు సాంకేతిక స‌హ‌కారాన్ని అందించేందుకు, మార్గ‌నిర్ధేశక‌త్వం చేసేందుకు, రుణం పొంద‌డంలో స‌హ‌క‌రించేందుకు ఒక క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని తెలిపారు. ఈ క‌మిటీలో మండ‌ల వ్య‌వ‌సాయాధికారి, ఉద్యాన అధికారి, బ్యాంకు బ్రాంచ్ మేనేజ‌ర్‌, ఇద్ద‌రు రైతులు ఉంటార‌న్నారు. ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసేందుకు ప్ర‌తీ అధికారి కృషి చేయాల‌ని క‌మిష‌న‌ర్ కోరారు.

విజ‌య‌న‌గ‌రం వ్య‌వ‌సాయ‌శాఖ సంయుక్త సంచాల‌కులు ఎం.ఆశాదేవి మాట్లాడుతూ.... రెండు,మూడు గ్రామాల‌కు క‌లిపి ఒక ఆర్‌బికేని ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని, అందువ‌ల్ల గ్రూపుల సంఖ్య‌ను పెంచాల‌ని కోరారు. వీడియో కాన్ఫ‌రెన్స్‌లో రాజ‌ధాని నుంచి స్పెష‌ల్ చీఫ్​ సెక్ర‌ట‌రీ పూనం మాల‌కొండ‌య్య‌తోపాటు ఇత‌ర ఉన్న‌తాధికారులు, జిల్లా నుంచి వ్య‌వసాయ‌శాఖ డిడి(ఆర్‌బికె) నాగ‌భూష‌ణ‌రావు, డీసీసీబి సిఈఓ జ‌నార్ధ‌న‌రావు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'చెత్త ఆటోలో తరలించిన వారిని సస్పెండ్ చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.