విజయనగరం జిల్లాలోని కురుపాం నియోజకవర్గం కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కోమరాడ, గరుగుబిల్లి మండలాల్లో అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రతి ఒక్కరూ అంబేడ్కర్ అడుగు జాడల్లో నడవాలని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గిరిజన గ్రామాల్లో అంబేడ్కర్ విగ్రహాలకు గిరిజన సంఘం నాయకులు పూలమాలలు వేసి, కేక్ కట్ చేశారు. అనంతరం దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
చీపురుపల్లిలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్ అనీ.. ఆయన ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు.
వైకాపా జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు.. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ సృష్టికర్త జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.
తెదేపా నాయకుడు కిమిడి నాగార్జున.. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. దేశంలో పేద వాళ్ళందరికీ న్యాయం జరిగేలా అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్మించి భారత దేశ జాతికి అంకితం చేశారన్నారు.
బాలాజీ జంక్షన్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి.. జిల్లా కలెక్టర్, ఎస్పీ పూలమాలలువేసి నివాళులర్పించారు. సమాజంలో వెనుకబాటుతనం పోవాలంటే విద్యే మార్గమని వారు సూచించారు.
రక్తదాన శిబిరం..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 130వ జయంతి సందర్భంగా విజయనగరం సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కనపాక యూత్ హాస్టల్ లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి హాజరయ్యారు. రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైకాపా నాయకులు ఈశ్వర్ కౌశిక్, జిల్లా సైనిక వెల్ఫేర్ అధికారి మజ్జి కృష్ణారావు, అసోసియేషన్ ప్రెసిడెంట్ సతీష్, సెక్రటరీ బడేపల్లి రామకృష్ణ రావు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: