విజయనగరం జిల్లా కేంద్రంలో ఏపీ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు స్థానిక ఆనందగజపతి ఆడిటోరియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. పనులను ఇంఛార్జి కలెక్టర్ కిషోర్ కుమార్, సంయుక్త కలెక్టర్ జె.వెంకటరావు, రెవిన్యూ డివిజినల్ అధికారి గణపతిరావు ఇతర అధికారులతో కలసి పరిశీలించారు.
హాల్ మొత్తం శానిటైజ్..
ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఉదయం 9.30 గంటలకు తెలుగు తల్లి విగ్రహానికి పూల మాల వేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం సందేశాన్ని అందిస్తారు. సీటింగ్‌కు భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. హాల్ మొత్తం శానిటైజ్ చేయించాలని సూచించారు.
ఆడిటోరియాన్ని మామిడి తోరణాలతో పూలమాలలతో అలంకరించాలని, ప్రవేశం వద్ద రంగవల్లులు వేయాలని, తాగు నీరు అందుబాటులో ఉంచాలని మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు.
సర్వం సిద్ధం
వేదిక వద్ద వేసిన కుర్చీలను పరిశీలించి వాటి మధ్య దూరం ఉండాలన్నారు. మంత్రి వచ్చేటప్పుడు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూడాలని ట్రాఫిక్ అధికారులకు సూచించారు. కార్యక్రమం పూర్తి అయ్యేవరకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం జరగకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. అత్యవసర వైద్యం నిమిత్తం పారా మెడికల్ సిబ్బందిని, 108 వాహనాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారులను ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో భవాని శంకర్, మున్సిపల్ కమిషనర్ వర్మ, పర్యటక శాఖ అధికారి లక్ష్మి నారాయణ, విపత్తుల ప్రాజెక్టు అధికారి పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : 'వైకాపా పాలనలో సామాన్యుడు నిత్యావసరాలు కొనలేని దుస్థితి'