విజయనగరం జిల్లా సీతానగరం మండలం చలం నాయుడు వలస గ్రామంలో సైబీరియా పక్షుల సంరక్షణ పై వ్యవసాయ అటవీ శాఖ అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. పక్షులు వలస వచ్చే సమయంలో పంటలు సాగు చేసే రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు నరసింహులు సూచించారు.
పొలాల్లో ఎరువులు, పురుగుల మందులు మితిమీరి వినియోగిస్తే పక్షులకు ప్రాణాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పారు. అతిధి పక్షులను సంరక్షించుకోవలసిన బాధ్యత అందరిపైనా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: