-
I will soon come and visit you guys❤️ you will inspire the nation. 🇮🇳 https://t.co/BTARu7G07e
— sonu sood (@SonuSood) August 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">I will soon come and visit you guys❤️ you will inspire the nation. 🇮🇳 https://t.co/BTARu7G07e
— sonu sood (@SonuSood) August 24, 2020I will soon come and visit you guys❤️ you will inspire the nation. 🇮🇳 https://t.co/BTARu7G07e
— sonu sood (@SonuSood) August 24, 2020
విజయనగరం జిల్లా సాలూరు మండలం మారుమూల ప్రాంతమైన కొదమ గ్రామ గిరిజనులు స్వచ్ఛందంగా రహదారి నిర్మాణం చేపట్టడంపై నటుడు సోనూసూద్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. వారిపై ప్రశంసలు కురిపించారు.
కొదమ పంచాయతీలోని రెండు గ్రామాల గిరిజనులు చందాలు వేసుకొని రహదారి నిర్మించుకున్నారు. కొదమ పంచాయతీలో 150 కుటుంబాలు ఉన్నాయి. వీరు తమ గ్రామాల నుంచి 4 కిలోమీటర్ల దూరంలోని ఒడిశా సరిహద్దు వద్ద ఉన్న బారి గ్రామం సంతకు వెళ్తుంటారు. ఆ ఊరి వరకైనా రహదారి నిర్మించుకోవాలని వారు సంకల్పించారు. ఒక్కో ఇంటికి రెండు వేల రూపాయలు చొప్పున చందాలు సేకరించారు. రెండు పొక్లెయిన్లతో రెండు వారాల పాటు కొండను తొలిచారు. మరో వారం రోజుల పాటు మట్టి వేసి 4 కిలోమీటర్ల దారిని ఇటీవలే ఏర్పరుచుకున్నారు.
గిరిపుత్రుల శ్రమైక స్ఫూర్తిని ఈనాడు- ఈటీవీ, ఈటీవీ భారత్ ప్రసారం చేశాయి. ఈనాడు-ఈటీవీలో ప్రసారమైన కథనాన్ని చూసిన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలోని ప్రజా చైతన్య వేదిక అనే స్వచ్ఛంద సంస్థ బాలీవుడ్ నటుడు సోనూసూద్‌కు ట్విట్టర్ ద్వారా విషయాన్ని చేరవేసింది. దీనికి స్పందించిన సోనూ... గిరిజనులను అభినందించారు.
ఇది ఉత్తమ వార్త. దేశం మొత్తం వీరిని అనుసరించాలని నేను కోరుకుంటున్నాను. కలిసికట్టుగా మనం ఏదైనా చేయగలం... చేద్దాం. త్వరలోనే మీ ప్రాంతానికి వస్తాను. మీరు భారత దేశాన్ని ప్రేరేపిస్తారు- సోనూసూద్, నటుడు