విజయనగరం జిల్లా భోగాపురం జాతీయ రహదారిపై లారీ అదుపు తప్పటంతో ముందు చక్రం విరిగి దూరంగా పడింది. దీంతో ఒక్కసారిగా రహదారిపై ప్రయాణించే వారంతా ఉలిక్కిపడ్డారు. లారీ వెనుక భాగం వంతెనను ఢీకొంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు.
ఇదీ చూడండి అనుమానాస్పద స్థితిలో వైద్యుడు మృతి