ETV Bharat / state

'పుట్టెడు దుఃఖం': డోలీలో తరలింపుతో గర్భిణికి నరకం - విజయనగరం జిల్లాలో గర్భిణిల సమస్యలు

గిరిజన ప్రాంతాల్లో మిగతా రోజుల్లో ఎలా ఉన్నా.... గర్భిణులకు మాత్రం ప్రసవించే సమయం దగ్గరకు వచ్చిదంటే చాలు.. నరకమే. సరైన మార్గం ఉండదు. ఆసుపత్రికి వెళ్లాలంటే కిలో మీటర్ల మేర ప్రయాణం చేయాలి. గిరిజన ప్రాంతాల్లో ఎటు చూసినా ఈ పరిస్థితి సర్వ సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది విజయనగరం జిల్లాలోని బొండపల్లిలో మండలం ఎర్రోడ్లపాలెంలో.

ఇంకెనాళ్లు డోలీ కష్టాలు
ఇంకెనాళ్లు డోలీ కష్టాలు
author img

By

Published : Dec 12, 2020, 6:40 AM IST

విజయనగరం జిల్లా బొండపల్లి మండలం ఎర్రోడ్ల పాలెం గిరిజన మహిళ పంగి జానకమ్మకు పురిటి నొప్పులు వచ్చాయి. ఆసుపత్రికి తరలించటానికి సరైన రోడ్డు మార్గం లేదు. ఆమెకు గ్రామ వాలంటీర్లు అండగా నిలిచారు. జానకమ్మను 4 కిలోమీటర్లు వరకు డోలీతో మోసుకెళ్లారు. అనంతరం ఆశావర్కర్లు, ఏఎన్​ఎమ్​లు సంబంధిత అధికారులకు సమాచారమిచ్చారు. వెంటేనే 108 వాహనం ద్వారా విజయనగరం ఘోషా ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చదవండి:

ముగిసిన విశాఖ రేంజ్ పోలీసు డ్యూటీ మీట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.