ETV Bharat / state

మూడు రాజధానులకు మద్దతుగా... విజయనగరంలో సంతకాల సేకరణ - a collection of signatures for supporting of 3 capitals in ap

మూడు రాజధానులకు మద్దతుగా... కోట జంక్షన్ వద్ద వైకాపా నాయకులు సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వైకాపా నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

a collection of signatures for supporting of 3 capitals in ap
మూడు రాజధానుల మద్దతుగా... విజయనగరంలో సంతకాల సేకరణ
author img

By

Published : Jan 29, 2020, 5:54 PM IST

మూడు రాజధానులకు మద్దతుగా... విజయనగరంలో సంతకాల సేకరణ

మూడు రాజధానులపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ... విజయనగరం జిల్లా కోట జంక్షన్ వద్ద సంతకాల సేకరణ చేపట్టారు. వైకాపా యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని... ఆ పార్టీ నాయకుడు మామిడి అప్పలనాయుడు ప్రారంభించారు. పరిపాలన, అభివృద్ధి, అధికారం, రాజకీయ వికేంద్రీకరణతోనే... రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి సమన్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ‍ఒకే ప్రాంతం అభివృద్ధితో ఇప్పటికే మద్రాస్, హైదరాబాద్​లని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి విభజన సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ ఒక్కటే మార్గమన్నారు. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికి... పార్టీలకతీతంగా అందరూ సహకరించాలని కోరారు.

ఇదీ చూడండి: 'దారి' లేని గిరిజన బతుకులు..!

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.