విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం వెంపడం గ్రామానికి చెందిన శ్రీను, రమ దంపతులు. వారి కుమారుడు నగేష్ (11) స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఉదయం స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలో కోనేరుకి వెళ్లాడు. తోటి పిల్లలతో సంతోషంగా ఆడుతూ.. స్నానం చేస్తుండగా ఒక్కసారిగా కోనేటిలో మునిగి పోయాడు. ఆందోళన చెందిన స్నేహితులు వెంటనే దీంతో కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వెంటనే కోనేరు దగ్గరకి పరుగులు పెట్టారు. కోనేటిలో గాలించగా నగేష్ మృతదేహం లభ్యమైంది. మరో గంటలో బడికి వెళతాడు అనుకున్న కుమారుడు ఇలా మృత్యువు ఒడికి చేరడంతో దినసరి కూలీలు అయినతల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి : ప్రయాణం నీటిలో.. ప్రాణాలు అరచేతిలో..