ETV Bharat / state

సారా తయారీ స్థావరాలపై దాడి.. 4300 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

విజయనగరం జిల్లా మెరకముడిదంలో నాటుసారా స్థావరాలపై అధికారులు దాడులు చేశారు. సుమారు 2500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. కర్నూలు జిల్లా సిరివల్ల మండలం పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. అక్కడ సుమారు 1800 లీటర్ల నాటుసారా ఊటను ధ్వంసం చేశారు.

4300 liters of jaggery destroyed
4300 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
author img

By

Published : Nov 13, 2020, 8:39 PM IST

విజయనగరం జిల్లా మెరకముడిదం మండలం గరుగుబిల్లి పరిధిలో గల నాటుసారా స్థావరాలపై చీపురుపల్లి స్పెషల్ ఎన్​ఫోర్స్​మెట్ బ్యూరో అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. సుమారు 2500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్స్​స్పెక్టర్ ఉమామహేశ్వర రావు హెచ్చరించారు.

కర్నూలు జిల్లాలో..

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎక్సైజ్ పోలీసులు నాటు సారా బట్టీలు ధ్వంసం చేశారు. సిరివల్ల మండలం మహాదేవపురం పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. అటవీ పరిధిలో 1800 లీటర్ల నాటుసారా ఊటను ధ్వంసం చేశారు. నాటుసారాను అరికట్టేందుకు తాము ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నామని ఎక్సైజ్ ఇన్స్​స్పెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు.

ఇదీ చదవండి:

తప్పని తిప్పలు... డోలిలో ఆసుపత్రికి గర్భిణి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.