విజయనగరం జిల్లా లచ్చయ్యపేట ఎన్‌సీఎస్ చక్కెర కర్మాగారం వద్ద చెరకు రైతుల ఆందోళన సందర్భంగా నిన్న (బుధవారం) అరెస్టైన నేతలను పోలీసులు బొబ్బిలి కోర్టులో హాజరుపరిచారు. చెరకు బకాయిల కోసం రైతులు, వామపక్ష నేతలు ఆందోళన చేపట్టగా.. వారిలో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు.
అరెస్టైన వారిలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎం.కృష్ణమూర్తి, సీపీఎం జిల్లా నాయకుడు కోరాడ ఈశ్వరరావు, సీఐటీయూ నాయకుడు గవర వెంకటరమణ, రైతు సంఘం నాయకులు కునుకు సంగంనాయుడు, రెడ్డి సత్యనారాయణ, చెరకు రైతు పువ్వల రాము ఉన్నారు. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వారిని బొబ్బిలి జైలుకు తరలించారు.
ఇదీ చదవండి
Farmers Protest: తిరగబడ్డ చెరకు రైతు.. తమపై దాడికి వచ్చిన పోలీసులను తరిమికొట్టి..