ETV Bharat / state

పర్యాటకానికి ఏపీ చిరునామా కావాలన్న జగన్‌ - అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వరే! - ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం వివరాలు

YSRCP Government Careless on Tourism Development: పర్యాటకం అంటేనే ఏపీ గుర్తుకురావాలన్నారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా వసతులు కల్పించాలని సెలవిచ్చారు. పర్యాటక రంగంలో పెట్టుబడిదారులకు ఎర్రతివాచీ పరచాలని చెప్పారు. మూడేళ్ల క్రితం ముఖ్యమంత్రి జగన్ అధికారులకు ఇచ్చిన ఆదేశాలు వింటే ఈ పాటికి నిజంగానే పర్యాటక రంగానికి ఏపీ చిరునామాగా మారిపోయిందని ఎవరైనా అనుకుంటారు. కానీ, పర్యాటకాన్ని అభివృద్ధి చేయకపోగా ఆయా ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించారు. అందుకు ప్రత్యక్ష నిదర్శనం బ్లూఫ్లాగ్‌ బీచ్‌ రుషికొండే.

YSRCP_Government_Careless_on_Tourism_Development

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 10, 2023, 1:56 PM IST

పర్యాటకానికి ఏపీ చిరునామా కావాలన్న జగన్‌ - అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వరే!

YSRCP Government Careless on Tourism Development : 2020 ఆగస్ట్‌ 20న పర్యాటక శాఖపై సీఎం సమీక్ష జరిపి పర్యాటక అభివృద్ధి చేయాలని సెలవిచ్చారని.. నాటి పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ (Avanti Srinivas) అన్నారు. కానీ ఆ దిశగా ఎలాంటి అడుగు ముందుకు పడలేదు. పైగా అందమైన విశాఖలోని రుషికొండ బీచ్‌ (Rushikonda Beach) రిసార్ట్‌ని కూలదోశారు. ఆధునీకరిస్తున్నామని చెప్పి 350 కోట్లకుపైగా ఖర్చు చేసి చివరకు సీఎం నివాసంగా మార్చేశారు.

Andhra Pradesh Tourism Sector : సువిశాలమైన తీరప్రాంతం ఏపీకి ఉన్నా దాన్ని వినియోగించుకోవడంలో వైఎస్సార్సీపీ సర్కార్‌ విఫలమైంది. బీచ్‌లలో వసతుల కల్పనకు రూపాయి ఖర్చు చేసిన పాపాన పోలేదు. తెలుగుదేశం హయాంలో బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌ (Surya Lanka Beach)లో పర్యాటకులకు షెల్టర్లు ఏర్పాటు చేస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాటిని తొలగించి.. సందర్శకులను అవస్థలపాల్జేసింది. మైపాడు బీచ్‌ (Mypadu Beach)లో పాడైన రిసార్ట్‌ల ఆధునికీకరణకు రూ.5 కోట్ల92 లక్షలు కేటాయించలేకపోయింది.

Tourism Development Situation in AP : రాష్ట్రంలో చాలా చోట్ల బీచ్‌లు ఉంటాయి. కానీ రుషికొండ బీచ్‌ మాత్రం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. పచ్చని కొండ ప్రాంతం, అందమైన ఇసుక తిన్నెలు, మత్స్యకారులు, చిన్నారులు, స్థానికులు, రోజూ వాకింగ్‌ చేసేవారు. ఇలా చాలా మంది ఇక్కడ తిరుగుతూ ఉంటారు. ఇలాంటి చోట బీచ్‌ నిర్వహణ అనేది చాలా ముఖ్యం. బీచ్‌ బాగుంటేనే ఎక్కవ మందిని ఆకర్షించగలదు. నిర్వహణ సరిగ్గా లేకుంటే పర్యాటకులు వచ్చేందుకు ఆసక్తి చూపరు.

విశాఖ తీరంలో సుందరీకరణ పేరుతో విధ్వంసం.. జీవీఎంసీ నిర్వాకంపై పర్యావరణ వేత్తల ఆందోళన

No Blue Flag Beach Development In Andhra Pradesh : తీర ప్రాంతాల్లో బీచ్‌ల సమగ్రాభివృద్ధికి బ్లూఫ్లాగ్‌ (Blue Flag Beach) విధానాన్ని కేంద్రం ప్రయోగాత్మకంగా ఐదేళ్ల క్రితం అమలు చేసింది. ఒక్కో బీచ్‌లో 10 కోట్లు వెచ్చించి 12 బీచ్‌లను అభివృద్ధి చేసి, రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది. వీటిలో రుషికొండ బీచ్‌ ఒకటి. ఇదే మోడల్‌లో రాష్ట్రంలో మరో 9 బీచ్‌ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు వేసి కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ప్రతినిధులతో కలిసి సర్వే చేయించింది. సూర్యలంక, రామాపురం, పేరుపాలెం, ముళ్లపర్రు, కాకినాడ, చింతలమోరి, మంగినపూడి, ఎర్రమట్టి దిబ్బలు, మైపాడు బీచ్‌ల్లో ప్రమాదాలకు ఆస్కారం తక్కువని గుర్తించారు. 9 బీచ్‌లకు కలిపి 67.5 కోట్ల రూపాయలు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేటాయించకపోవడంతో ప్రతిపాదిత బ్లూఫ్లాగ్‌ బీచ్‌ల అభివృద్ధి కాగితాలకే పరిమితమైంది.

Neglect of Release of Funds for Tourism Sector : బ్లూఫ్లాగ్‌ బీచ్‌ల అభివృద్ధిని అటకెక్కించిన అధికారులు కోస్తా తీరం వెంబడి కొత్తగా మరో 363 బీచ్‌ల అభివృద్ధి ప్రతిపాదనలతో ముందుకొచ్చారు. ఇందుకోసం మత్స్య విశ్వవిద్యాలయం, మత్స్యశాఖ ఆధ్వర్యంలో 11 బృందాలు సర్వే చేశాయి. ప్రతిపాదనలైతే సిద్ధం చేసినా నిధుల విడుదలలో జగన్‌ సర్కార్‌ నిర్లక్ష్యంతో పనుల్లో ముందడుగు పడలేదు. విశాఖలో తీరం వెంబడి ప్రత్యేకంగా పది బీచ్‌లను నూతనంగా అభివృద్ధి చేయాలని ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ప్రతిపాదించింది. నిధుల్లేక అవీ ప్రతిపాదనల స్థాయి దాటలేదు..

Tourism Development in AP ప్రపంచం రాష్ట్రంవైపు చూసే పర్యాటకం ఇదేనా..! ఆహా.. ఓహో అంతా ప్రగల్భాలేనా..! కేంద్రం ముందుకొచ్చినా..

Lack of Facilities in Visakha RK Beach : పర్యాటక రద్దీ అధికంగా ఉండే విశాఖ ఆర్కే బీచ్‌ వసతుల లేమితో ఇబ్బంది పడుతోంది. తరుచూ ప్రమాదాలు జరిగి పర్యాటకులు ప్రాణాలు కోల్పోతున్నారు. రక్షించేందుకు ఏర్పాటు చేసిన 46 మంది గజ ఈతగాళ్లకు ఐదు నెలలుగా జీతాల్లేవు. పర్యాటకులు దుస్తులు మార్పుకోడానికి ప్రత్యేకంగా గదులు లేవు. తాగునీటికీ ఇబ్బందే. ఇతర ప్రాంతాల నుంచి మురుగు నీరు నేరుగా వచ్చి ఆర్కే బీచ్‌లో కలుస్తున్నా పట్టించుకోవడం లేదు.

Lack of Facilities in Surya Lanka Beach : బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌లోనూ సౌకర్యాలు సరిగ్గా లేవు. సందర్శకులకు.. రిసార్ట్‌లోని 27 గదులు ఏ మూలకూ సరిపోవడం లేదు. తొలగించిన షెల్టర్ల నిర్మాణం తిరిగి ప్రారంభం కాలేదు. తాగునీటి నుంచి షెల్టర్‌ వరకు పర్యాటకులకు ఇక్కట్లు తప్పడం లేదు.

Neglected on Maipadu Beach : నెల్లూరు జిల్లాలోని మైపాడు బీచ్‌ నిర్లక్ష్యానికి గురవుతోంది. గత ప్రభుత్వం ఇక్కడ 16 రిసార్ట్స్‌ నిర్మించగా ప్రస్తుతం 10 అందుబాటులో ఉన్నాయి. మరమ్మతులు చేయాల్సిన మిగతా ఆరు రిసార్ట్స్‌లో పనులు సాగడం లేదు. వారాంతపు రోజుల్లో, కార్తీక మాసంలో భారీ సంఖ్యలో ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. పర్యాటకశాఖ అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన ఆ శాఖ మంత్రి రోజా రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నారు.

Visakha Beach Turns into Pollution: డంపింగ్​యార్డ్​ని తలపిస్తోన్న విశాఖ బీచ్.. ప్రకృతి ప్రేమికుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.