విశాఖ జిల్లా పెదపాడు గ్రామానికి చెందిన కట్టమూరి సన్యాసి నాయుడు అనే యువకుడు ఈ నెల 6న పెదపాడు గ్రామ శివారులో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. స్థానికులు ఆసుపత్రికి తరలించగా..మూడు రోజులు చికిత్స అందించారు. అనంతరం నిన్న బ్రెయిడ్ డెడ్ అయినట్లు డాక్టర్లు నిర్ధరించారు. దీంతో తమ కుమారుడు అవయవాలు దానం చేయాలని తల్లిదండ్రులు సత్తిబాబు, సత్యవతి నిర్ణయం తీసుకున్నారు.
ఈరోజు కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో సన్యాసి నాయుడి అవయవాలను మరో నలుగురికి దానం చేశారు. అనంతరం మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించారు. కుమారుడు దూరమయ్యాడన్న బాధలోనూ అవయవదానానికి తల్లిదండ్రులు ఒప్పుకోవటం పలువురిచే కంటతడి పెట్టించింది.
ఇదీచదవండి: ఫ్రీగా ఇస్తానన్న రైతు- మార్కెట్ ధరకు కొన్న సైన్యం