వేసవి కాలంలో కావటంతో సరదాగా ఈత కొడదామని బావిలో దిగి యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన విశాఖ జిల్లా రావికమతం మండలంలో జరిగింది. గట్టా రమణ(23) తన స్నేహితులతో కలిసి గ్రామ శివారు బావిలోకి దిగారు. అందరూ కలిసి ఈత కొడుతుండగా.. రమణ నీటి లోపలికి వెళ్లటంతో ఊబిలో చిక్కుకుపోయాడు. బావిలోకి దిగిన రమణ ఎంతకీ బయటకు రాకపోవటంతో.. స్నేహితులు పెద్దలకు విషయాన్ని చేరవేశారు. కొందరు వ్యక్తులు బావిలోకి దిగి మృతదేహాన్ని తాళ్లతో బయటకు తీశారు.
ఇవీ చూడండి..