విశాఖపట్నంలోని కళాభారతి వేదికగా...యోగి వేమన జీవితగాథను నాటక రూపంలో ప్రదర్శించారు కళాకారులు. రంగసాయి నాటక సంఘం నేతృత్వంలో ప్రదర్శించిన వినుర వేమ నాటకం, హైదరాబాద్ వారి అభ్యుదయ ఆర్ట్ అకాడమీ ప్రదర్శించిన యోగి వేమన జీవితగాథ, నాటకాలు ప్రేక్షకులను అలరించాయి. వేమనకు జ్ఞానోదయం కలిగిన తీరు, సమాజంలో ఎదురైనా సంఘటనల నుంచి పద్యాలు రచించిన తీరును...కళాకారులు కళ్ళకు కట్టి చూపించారు. నాటకంలో పాత్రధారులు ప్రతి పద్యం, దాని సందర్భంతో సులువుగా ప్రేక్షకులకు అర్ధమయే రీతిలో ప్రదర్శించారు. విశాఖలోని వివిధ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ఈ నాటకాలను చూపించారు.
ఇదీ చూడండి: దారుణం.. నీటి కుంటలో నవజాత శిశువు మృతదేహం