విశాఖ జిల్లా రాంబిల్లి మండలంలో భారీ వర్షాల కారణంగా శారదా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు.. రాంబిల్లి మండలం లోని వై.లోవ గ్రామం నీటితో నిండిపోయింది. వర్ష ప్రభావం వల్ల జనజీవనం స్తంభించింది.
అనేక పశువులు వర్షంలో తీవ్ర ఇబ్బంది పడ్డాయి. ఎదిగిన పంటలు నీటి మునిగిపోయాయి. కనుచూపుమేరలో ఎటు చూసినా నిలిచిపోయిన వరద నీరే కనిపించింది. జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేసి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: