అసెంబ్లీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా.. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు వ్యవహరించారని వైకాపా కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎంవీపీ కాలనీలోని టీటీడీ కల్యాణమండపం నుంచి ర్యాలీగా వెలగపూడి ఇంటి వైపు కదిలారు. ఎమ్మెల్యే ఇంటిని దిగ్బంధం చేసేందుకు వైకాపా శ్రేణులు వస్తున్నారన్న సమాచారంతో తెదేపా కార్యకర్తలు ర్యాలీకి అడ్డు తగిలారు. గిరిజన భవన్ కూడలి వద్ద రెండు పార్టీలకు చెందిన వారు.. పరస్పరం వ్యతిరేక నినాదాలు చేశారు. తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఇదీ చదవండి:
అనకాపల్లిలో ఘనంగా వైకాపా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు