ETV Bharat / state

కలెక్టర్​పై చిందులు వేసిన అరకు వైకాపా నాయకులు - visakha district paderu latest news

పాడేరులో జరిగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేడుకలకు కలెక్టర్ వినయ్​చంద్​ ఆలస్యంగా రావడం వల్ల అరకు వైకాపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీలపై చిన్నచూపు తగదంటూ మాట్లాడారు. అనంతరం అధికారులు కలగజేసుకుని వైకాపా నాయకులను వారించారు.

ycp leaders serious on collector at paderu
కలెక్టర్​పై అగ్రహం వ్యక్తం చేసిన అరకు వైకాపా నాయకులు
author img

By

Published : Aug 9, 2020, 7:49 PM IST

పాడేరులో వైకాపా నాయకులు కలెక్టర్​ వినయ్​చంద్​పై చిందులు వేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకకు ఉదయం 10 గంటలకు రావాల్సిన కలెక్టర్… ఆలస్యంగా రావడం వల్ల కార్యక్రమాన్ని​ పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, అరకు ఎమ్మెల్యే పాల్గుణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్​ 11 గంటలకు వచ్చారు. దీనిపై అరకు వైకాపా నాయకులు చిందులు వేశారు. ఆదివాసీలంటే లెక్క లేదా? సమయపాలన లేదా అంటూ కలెక్టర్​ను ప్రశ్నించారు. దీంతో అక్కడ పరిస్థితిని అదుపు చేసేందుకు అధికారులు కలగజేసుకుని వారిని వారింపజేశారు. విజయవాడలోని కొవిడ్​ ఆసుపత్రిలో జరిగిన ప్రమాదం వల్ల జరిగిన వీడియో కాన్ఫరెన్స్​ కారణంగా ఆలస్యం జరిగిందని చెప్పారు.

ఇదీ చదవండి :

రహదారిపై వైకాపా నేత కన్ను... రాత్రికి రాత్రే చదును!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.