మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొంది.. విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా ఏర్పడిన సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం వైకాపా నేతల ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన చేపట్టారు. సీఎం జగన్ రాజనీతిజ్ఞుడుగా.. భావి తరాలకోసం ఆలోచన చేశారని... విశాఖ పరిపాలన కేంద్రంగా ప్రపంచంలోనే గొప్ప నగరంగా మారబోతుందని వైకాపా నేత కే.కే రాజు అన్నారు.
ఉత్తరాంధ్ర ప్రజలు ముఖ్యమంత్రి జగన్కు ఎప్పటికీ కృతజ్ఞులై ఆయన వెన్నంటే ఉంటారన్నారు. పరిపాలన వికేంద్రీకరణతో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని.. చారిత్రాత్మకమైన ఈ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.
ఇదీ చదవండి: