ETV Bharat / state

ఎన్నికల సిబ్బందితో వైకాపా నేతల వాగ్వాదం... గంభీరంలో తోపులాట

తెదేపా సానుభూతిపరుడికి ఎన్నికల సిబ్బంది రెండు బ్యాలెట్ పత్రాలు ఇవ్వడం ఘర్షణకు దారి తీసింది. విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరం పోలింగ్ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న వైకాపా కార్యకర్తలు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.

tension in gambhiram polling station, ycp leaders questioned election staff
ఎన్నికల సిబ్బందితో వైకాపా నేతల వాగ్వాదం, గంభీరం పోలింగ్ కేంద్రంలో తోపులాట
author img

By

Published : Apr 8, 2021, 9:36 PM IST

విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరం పోలింగ్ కేంద్రంలో తోపులాట జరిగింది. ఓ వ్యక్తికి రెండు బ్యాలెట్ పత్రాలు ఇవ్వడంపై.. వైకాపా ఏజెంట్లు అభ్యంతరం తెలిపారు. ఈ ఘటనతో అధికార పార్టీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రంలోకి దూసుకొచ్చారు. ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. తెదేపా సానుభూతిపరుడికి 2 బ్యాలెట్ పత్రాలు ఎలా ఇస్తారని నిలదీశారు. ఈ ఘటనతో.. కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. కొద్దిసేపు పోలింగ్ నిలిపివేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. పోలీసులు దగ్గరుండి ఓటర్లను క్యూలైన్లలో పంపించి పోలింగ్ ప్రక్రియను ముందుకు నడిపించారు.

ఇదీ చదవండి:

పాడేరులో భారీ వర్షం... ఓటర్లకు అనుకోని కష్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.