పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖను పారిశ్రామిక, సేవా రంగాల్లో మొదటి శ్రేణి నగరంగా (టైర్-1 సిటీ) నిలిపేందుకు ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుందని పార్లమెంటరీ స్థాయి సంఘం (వాణిజ్యం) చైర్మన్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. శనివారం విశాఖలో జరిగిన పారిశ్రామిక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తూర్పు ఆసియా, ఆస్ట్రేలియాలతో వాణిజ్య సంబంధాలకు విశాఖ అనువైందని పేర్కొన్నారు.
వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి భారీగా ఎఫ్డీఐలు (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) రాష్ట్రానికి రాబోతున్నయని కేర్ అనే సంస్థ జరిపిన సర్వేలో తేలిందని గుర్తు చేశారు. వీటి ద్వారా విశాఖ మరింత అభివృద్ధి సాధిస్తుందని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో పారిశ్రామిక పెట్టుబడుల విషయంలో తప్పుడు లెక్కలు చూపించారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆరోపించారు. పారిశ్రామిక సంస్థలకు కొవిడ్ సమయంలో ఎదురైన ఇబ్బందులు తెలుసుకున్నామని, కొన్ని ఈ సదస్సులోనే పరిష్కరించామని మంత్రి కన్నబాబు తెలిపారు.
ఇదీ చదవండి: