విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలంలోని జేబీపురం, వరహాపురం గ్రామాల్లో వైకాపా కూరగాయలు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన వైకాపా నేతలు గొల్లవిల్లి రాజబాబు, ధర్మిశెట్టి కొండబాబు సొంత నిధులతో కూరగాయలను సమకూర్చారు. గ్రామాల్లోని 750 కుటుంబాలకు.. ఆరు కిలోల చొప్పున వివిధ రకాల కూరగాయలు ఇచ్చినట్లు తెలిపారు. వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శి పి సతీష్వర్మ, మండల పార్టీ అధ్యక్షుడు అప్పారావు చేతుల మీదగా వాటిని ఇంటింటికీ పంపిణీ చేశారు.
ఇది చదవండి ఇబ్బందులుంటే మా దృష్టికి తీసుకురండి: ఎస్పీ