విశాఖ జిల్లాలోని యారాడ దర్గా భూముల వ్యవహారం.. న్యాయస్ధానంలో ఉన్నప్పటికి ఏదో ఫిర్యాదు వచ్చిందని వక్ఫ్ బోర్డుకి సంబంధం లేకుండా అక్కడ తాళాలు వేయడం సరికాదని.. దర్గా కమిటీ స్పష్టం చేసింది. వందల ఏళ్ల క్రితం నిజాం కాలంలో ఈ యారాడ దర్గాకు భూములను ఇచ్చారని, అప్పటి నుంచి రెండున్నర వేల ఎకరాల భూమి.. దర్గా ఆధీనంలో ఉందని కమిటీ తెలిపింది. చందన ఉత్సవం .. సజావుగా జరగనీయకుండా అడ్డుకునేలా చర్యలు తీసుకోవడం ఆక్షేపణీయమన్నారు. ఈ వ్యవహారం హైకోర్టులో ఉన్న కారణంగా.. ఈ ఉత్సవ నిర్వహణకు స్ధానిక పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం సహకరించాలని కమిటీ సభ్యులు కోరారు.
ఇదీ చదవండి: RRR LETTER: సీఎం జగన్కు ఎంపీ రఘరామరాజు మరో లేఖ..ఈ సారి ఏంటంటే!