కంటి సమస్యల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలంటూ అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ కుమార్ తెలిపారు. వరల్డ్ సైట్ డే సందర్భంగా ఆసుపత్రిలో కంటి ప్రాముఖ్యతను వివరించేలా కరపత్రాలు పంపిణీ చేశారు. 35 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారైనా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కంటి పరీక్షలు, శస్త్ర చికిత్సలకు సంబంధించిన ఆధునిక పరికరాలు ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఆసుపత్రిలో కంటి పరీక్షలతో పాటు అవసరమైన వారికి వారంలో రెండు రోజులు ఉచితంగా శస్త్ర చికిత్సలు చేస్తున్నామని ఆప్తమాలజిస్ట్ వైద్యురాలు లావణ్య తెలిపారు.
ఇదీ చదవండి :