ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు వైద్యం అందించే సమయంలో... పొగతాగే అలవాటు ఉన్నట్లు గుర్తిస్తే వైద్యంతోపాటు... కౌన్సిలింగ్ ఇస్తున్నారు విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి వైద్యులు. పాఠశాల, కళాశాలలో పొగ తాగడం వల్ల కలిగే అనర్ధాల గురించి విద్యార్థులకు వివరిస్తున్నారు. పొగ తాగడం వల్ల క్యాన్సర్తో పాటుగా శరీరంలోని అవయవాలకు వ్యాధులు సోకే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పొగతాగే అలవాటు మాన్పించాలంటే... దీని వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించడంతోపాటు... అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం సంకల్పిచింది. జిల్లాకో ధూమపాన నియంత్రణ విభాగాన్ని ఏర్పాటు చేసి... దీని ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఈ విభాగానికి వచ్చిన పలువురు ఇక్కడ అందిస్తున్న కౌన్సిలింగ్ ద్వారా పొగాకుకు దూరంగా ఉంటున్నారని సైకాలజిస్ట్ శ్యామల తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం చేసేందుకు ఈ విభాగం అధికారులు దృష్టి సారిస్తున్నారు.
ఇదీ చదవండీ...