విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం చీడికాడ, తురువోలు, కోనాం, మంచాల గ్రామాల్లో గురువారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం కూలీలు పని ప్రదేశంలో నిరసన చేపట్టారు. ఏడాదిలో 200 రోజుల పనిదినాలు కల్పించాలని, రోజువారి కూలీ రూ.300 ఇవ్వాలని కోరారు.
కేరళ ప్రభుత్వం తరహా 16 రకాలు నిత్యావసర సరకులు, రూ.7500 ఆర్ధిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రమాద బీమా, మెడికల్ కిట్లు అందించాలన్నారు. 15 రోజులకు ఒకసారి కూలీ నగదు చెల్లించాలని కూలీలు సామాజిక దూరం పాటించి నిరసన తెలియజేశారు. అనంతరం చీడికాడలో ఉపాధి హామీ పథకం ఏపీఓ మురళికు వినతి పత్రం అందజేశారు.
ఇది చదవండి చోడవరంలో నిరాశ్రయులకు అన్నదానం