మహిళలకు రక్షణ కల్పించడం కోసమే పోలీసులు ఉన్నారని... వారి సేవలు వినియోగించుకోవాలని అనకాపల్లి డీఎస్పీ శ్రావణి పేర్కొన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఆస్క్ ఇంజినీరింగ్ కళాశాలలో 'ఈనాడు- ఈటీవీ భారత్' ఆధ్వర్యంలో మహిళల రక్షణపై అవగాహన సదస్సు జరిగింది. దిశ సంఘటన నేపథ్యంలో మహిళల భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి డీఎస్పీ వివరించారు. ఆపద సమయంలో ఉన్న విద్యార్థినులు, మహిళలు 100కి సమాచారం ఇచ్చి రక్షణ పొందవచ్చన్నారు.
సైబర్ మిత్ర సేవల టోల్ ఫ్రీ నెంబర్ 9121211100 కి సమస్యను వాట్సప్ చేయవచ్చన్నారు. ప్రయాణ సమయంలో చుట్టుపక్కల ఏం జరుగుతుందన్న దానిపై మహిళలు దృష్టిపెట్టాలని సూచించారు. అనంతరం విద్యార్థుల రక్షణకు కోసం కరాటే డెమోను మహిళా కానిస్టేబుల్స్ ప్రదర్శించారు.
ఇవీ చదవండి..మహిళల భద్రతకు త్వరలోనే ఆర్డినెన్స్..!