విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలోని శారదనగర్ వద్ద మహిళలు నిరసనకు దిగారు. ప్రభుత్వ మద్యం దుకాణాన్నిఈ ప్రాంతం నుంచి తక్షణమే తరలించాలంటూ ఆందోళన చేశారు. కంటైన్మెంట్ జోన్ పరిధిలో ఉన్న వారు మద్యం తాగడానికి వస్తున్నారని.. దీనివల్ల
ఇక్కడ కరోనా ప్రబలే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మహిళలు వాపోయారు.
ఇదీ చూడండి:'14 ఎకరాల ప్రభుత్వ భూములను పరిరక్షించండి'