ETV Bharat / state

సర్పంచ్ కోసం... పోలీస్​ స్టేషన్ ఎదుట మహిళల ఆందోళన

విశాఖపట్నం జిల్లా కొత్తకోట పోలీస్ స్టేషన్ ఎదుట మహిళలు ఆందోళన చేశారు. తమ గ్రామ సర్పంచ్ పై.. ఓ దళిత మహిళా వాలంటీర్ తప్పుడు కేసు పెట్టారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. సర్పంచ్ సంజీవ్​ను అరెస్టు చేయవద్దని డిమాండ్ చేశారు.

పోలీస్​ స్టేషన్ ఎదుట మహిళల ఆందోళన
పోలీస్​ స్టేషన్ ఎదుట మహిళల ఆందోళన
author img

By

Published : Jul 6, 2021, 9:16 PM IST

విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం వమ్మవరం గ్రామానికి చెందిన ఓ దళిత మహిళ... వాలంటీర్​గా విధులు నిర్వహిస్తోంది. విధుల్లో భాగంగా స్థానిక సర్పంచ్ సంజీవ్... తనను కులం పేరుతో దూషించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న కొత్తకోట పోలీసులు... సర్పంచ్​తో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో వాలంటీర్... అసత్య ఆరోపణలు చేస్తున్నారని పోలీస్ స్టేషన్ ఎదుట మహిళలు ఆందోళన చేశారు. సర్పంచ్ సంజీవ్​ను అరెస్టు చేయవద్దని నినాదాలు చేశారు.

ఇదీ చదవండి:

IT raids: రాంకీ సంస్థలో ఆదాయపన్ను శాఖ తనిఖీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.