విశాఖ ఏజెన్సీ డుంబ్రిగుడ మండలం మారుమూల రంగిలిసింగిలో ఆరు సంవత్సరాలుగా పాంగి సీతమ్మ, పాంగి దామోదర్ కుటుంబాల మధ్య భూ వివాదం నడుస్తోంది. ఇటీవల రెవెన్యూ అధికారులు భూమి సీతమ్మకు చెందినదిగా ప్రకటించారు. ఈ కారణంగా కక్ష పెంచుకున్న దామోదర్ కుటుంబం నాటు తుపాకీతో సీతమ్మను కాల్చారు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మరో ముగ్గురిని కాల్చేందుకు ప్రయత్నించగా వారు తప్పించుకున్నారు. నిందితుడు దామోదర్ కుటుంబ సభ్యులతో కలిసి పారిపోయాడు.
సీతమ్మ మరణంతో కోపంతో గ్రామస్థులు నిందితులకు చెందిన మూడు ఇళ్లకు నిప్పులు పెట్టారు.. మరో ద్విచక్రవాహనాన్ని కాల్చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. గ్రామస్థులు కత్తులు, గొడ్డలతో ఎదురుతిరిగారు. ఎవరూ ఊరిలోకి రావొద్దని పేర్కొన్నారు. ఆరేళ్లుగా భూవివాదం నడుస్తుంటే.. ఎవరూ రాలేదని ఇప్పుడు వచ్చారా? అని బెదిరించే ప్రయత్నం చేశారు. పోలీసులు ప్రత్యేక బెటాలియన్‌తో మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
ఇదీ చదవండి: విజయనగరంలో ఆ యువతి కాళ్లు, చేతులు కట్టిపడేసింది ఎవరో తెలుసా..?