ETV Bharat / state

అంబులెన్స్​లో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం - విశాఖ పాడేరులో అంబులెన్సులో ప్రసవించిన మహిళ

విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ పరిధిలోని జి.మాడుగులలో.. ఓ మహిళ పురిటి నొప్పులతో బాధపడింది. కుటుంబ సభ్యులు అంబులెన్సుకు ఫోన్ చేశారు. అంబులెన్సు గ్రామానికి చేరుకోగా.. స్థానికులు అడ్డుకున్నారు. కొద్దిదూరంలో అంబులెన్సును ఉంచి.. మహిళను అక్కడివరకు నడిపించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే ప్రసవించింది.

women delivered in ambulance at vishaka
women delivered in ambulance at vishaka
author img

By

Published : May 10, 2021, 8:09 PM IST

కరోనా కారణంగా గ్రామాల్లోకి అంబులెన్సులను సైతం రానివ్వటం లేదు. విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం పాలమామిడిలో పాంగి లలిత అనే నిండు గర్భిణి.. పురిటి నొప్పులతో బాధ పడుతుండగా ఆమె కుటుంబీకులు అంబులెన్సును సంప్రదించారు. అంబులెన్సు రాగానే గ్రామస్థులు అడ్డుకున్నారు. సచివాలయ సిబ్బందికి తప్ప ఎవ్వరికి ప్రవేశం లేదని బోర్డు పెట్టారు.

గ్రామంలోకి వచ్చిన వైద్య సిబ్బందిని సైతం వెనక్కి పంపించారు. అంబులెన్సును గ్రామానికి కొంచెం దూరంలో ఉంచి.. గర్భిణిని నడిపించుకుంటూ అక్కడి వరకు తీసుకెళ్లారు. అంబులెన్సు ఎక్కిన కాసేపటికి.. మహిళకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. ఆస్పత్రికి ప్రయాణిస్తుండగా మార్గమధ్యలోనే మహిళ ప్రసవించింది. జి.మాడుగుల ఆస్పత్రికి తరలించగా.. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి:

తెలంగాణ వాహనాలకు.. షరతులతో కూడిన అనుమతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.