ETV Bharat / state

పాము కాటుతో ఉపాధి హామీ మహిళ మృతి - విశాఖపట్నం నేటి వార్తలు

విశాఖపట్నం జిల్లా చూచుకొండలో విషాదం జరిగింది. ఉపాధి హామీ పనులు ముగించుకుని ఇంటికి వస్తున్న మహిళను పాము కాటు వేసింది. ఈ ఘటనతో మృతురాలి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Women Death with snake bite in choochukonda vishakhapatnam district
పాము కాటుతో ఉపాధి హామీ మహిళ మృతి
author img

By

Published : Jul 2, 2020, 7:37 PM IST

విశాఖపట్నం జిల్లా మునగపాక మండలం చూచుకొండ గ్రామానికి చెందిన పెంటకోట లక్ష్మీనారాయణమ్మ ఉపాధి హామీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. రోజు మాదిరిగా గురువారం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా పాము కాటువేసింది. గమనించిన సహచర కూలీలు నారాయణమ్మను చికిత్స నిమిత్తం స్థానిక పీహెచ్​సీ కు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్​కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. గతంలోనే మృతురాలి భర్త చనిపోయాడు. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. మునగపాక ఎస్ఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి.

జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.