విశాఖ జిల్లా మర్రిపాలెం మహారాణీ వీధికి చెందిన స్వరూపారాణి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. బుధవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆమె అత్మహత్యకు పాల్పడింది. అత్త, కుటుంబసభ్యులు స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు చెప్పగా... మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. తమ కుమార్తెను అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఎయిర్పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమ జోన్ ఏసీపీ జి.స్వరూపారాణి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతురాలి భర్త ముప్పిడి గౌరీ ప్రసాద్‌తో పాటు అతడి కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా చర్యలు చేపడుతామని ఏసీపీ తెలిపారు.
ఇదీ చూడండి: గతి తప్పిన గంగపుత్రుల జీవన నావ..!