ETV Bharat / state

విశాఖలో కొవిడ్ పరీక్షలకు భయపడి మహిళ పరారీ

author img

By

Published : Jun 21, 2020, 6:29 PM IST

ఇతర రాష్ట్రాల నుంచి విశాఖకు వస్తున్న వారికి అధికారులు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇది తెలుసుకున్న ఓ మహిళ భయంతో పరారయ్యింది. అప్రమత్తమైన అధికారులు నాల్గొవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

woman escape for conducting  covid(corona) tests to her at visakhapatnam district
కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తారని తెలిసి మహిళ పరార్

విశాఖలో కోవిడ్ పరీక్షలకు భయపడి ఓ ప్రయాణికురాలు పరారైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. పోర్టు ఆసుపత్రి సమీపంలోని సీతారామ కళ్యాణ మండపంలో కొంతమంది ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అందులో ఓ ప్రయాణికురాలు తప్పించుకుని పారిపోయిన విషయాన్ని గుర్తించిన రెవెన్యు సిబ్బంది.. వెంటనే అప్రమత్తమయ్యారు.

ఓ మహిళ కోవిడ్ పరీక్షలు చేయించుకోకుండా పారిపోయిందని నాల్గొవ పట్టణ పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. దిల్లీ నుంచి వచ్చిన సదరు మహిళ వివరాలు సేకరించిన పోలీసులు.. ఆమె ఎక్కడ ఉందో గుర్తించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 477 కరోనా పాజిటివ్‌ కేసులు..ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.