ETV Bharat / state

DEADBODY: విశాఖ బీచ్​లో మహిళ మృతదేహం.. దుస్తులు సరిగా లేని స్థితిలో - దుస్తులు లేని స్థితిలో విశాఖ బీచ్​లో మహిళ మృతదేహం

Women Suspect Death at Beach: విశాఖ బీచ్​లో పడి ఉన్న ఓ మహిళ మృతదేహం తీవ్ర కలకలం రేపుతోంది. దుస్తులు సరిగా లేని స్థితిలో అనుమానాస్పద రీతిలో పడి ఉన్న మహిళ మృతదేహాన్ని మూడో పట్టణ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి గుర్తించారు. అసలేం జరిగిందంటే..?

Women Suspect Death at Beach
విశాఖ బీచ్​లో అనుమానాస్పద రీతిలో యువతి మృతదేహం
author img

By

Published : Apr 26, 2023, 2:53 PM IST

Updated : Apr 26, 2023, 5:22 PM IST

విశాఖ బీచ్​లో అనుమానాస్పద రీతిలో మహిళ మృతదేహం

Women Suspect Death at Beach: విశాఖపట్నం జిల్లాలో అనుమానాస్పద రీతిలో ఓ మహిళ మృతదేహం కలకలం రేపుతోంది. వైఎంసీఏ ఎదురుగా ఉన్న బీచ్​ వద్ద అనుమానాస్పద స్థితిలో ఉన్న ఆ మహిళ మృతదేహాన్ని మూడవ పట్టణ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి గుర్తించారు. సరిగా దుస్తులు లేని స్థితిలో ఆమె మృతదేహం బీచ్ వద్ద పడి ఉంది. కేవలం లోదుస్తులతో మాత్రమే ఇసుకలో పడి ఉన్న ఆ మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతి చెందిన మహిళను పెదగంట్యాడకు చెందిన శ్వేతగా పోలీసులు గుర్తించారు.

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. పెదగంట్యాడకు చెందిన శ్వేతకు రెండేళ్ల క్రితం సాఫ్ట్​వేర్ ఉద్యోగి మణికంఠతో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భవతి. ఆమె భర్త మణికంఠ ఉద్యోగ రీత్యా హైదరాబాద్​లో ఉంటున్నాడు. కాగా.. శ్వేత పెదగంట్యాడలోని గాంధీనగర్​లో అత్తమామలతోనే కలిసి ఉంటోంది. అయితే అత్తమామలకు, శ్వేతకు సరిగా పడేది కాదు. తరచూ వారికి, శ్వేతకు మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే మంగళవారం మధ్యాహ్నం కూడా అత్తకు, శ్వేతకు మధ్య గొడవ జరిగింది. దీంతో ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఎంతసేపటికీ ఆమె ఇంటికి రాకపోవటంతో అత్తామామలు.. శ్వేత కనిపించటం లేదని న్యూపోర్ట్ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

గొడవ జరిగిన అనంతరం ఇంటి నుంచి బయటకు వచ్చిన శ్వేత మంగళవారం సాయంత్రం భర్తతో ఫోన్​లో మాట్లాడి.. భర్తతో గొడవపడింది. ఆ వెనువెంటనే శ్వేత ఫోన్ పడేసి.. విశాఖ బీచ్​ వద్దకు చేరుకుంది. ​కాగా బుధవారం తెల్లవారుజామున విశాఖ బీచ్​లో శ్వేత మృతదేహంగా కనిపించింది. మృతురాలు శ్వేత స్వగ్రామం శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట. ఆమె తల్లి రమా విశాఖ రైల్వే ఆస్పత్రిలో నర్స్​గా విధులు నిర్వస్తూ జీవనం సాగిస్తోంది. మృతురాలి తల్లి రమా.. ప్రస్తుతం దొండపర్తిలో నివాసం ఉంటోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. యువతిని ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో అనుమానాస్పద మృతిగా విచారణ చేపట్టారు.

"విశాఖ బీచ్‌లో అర్ధరాత్రి తర్వాత మహిళ మృతదేహం కనిపించింది. అప్పటికే మహిళ కనిపించట్లేదని వారి అత్త, మామ ఫిర్యాదు చేశారు. మృతదేహంపై ఎలాంటి గాయాల్లేవు. ఆమె మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. సూసైడ్ నోట్‌పై న్యూపోర్టు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు." - విశాఖ ఈస్ట్‌ ఏసీపీ వివేకానంద

"నిన్న సాయంత్రం ఇంచుమించు 6.30 గంటల సమయంలో శ్వేతకు నేను ఫోన్ చేశాను. గొడవల గురించి ఇద్దరం కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుదాం అని చెప్పాను. నేను తనకు ఎంత సర్ది చెప్పినా.. ఆమె నా మాట వినకుండా నీకు నేనూ అక్కర్లేదు.. పిల్లలు అక్కర్లేదు అని చెప్పి కాల్ కట్ చేసేసింది. ప్రతి రెండు మూడు నెలలకు ఒక్కసారి మా అమ్మనాన్న వాళ్లతో తనకు గొడవలు జరుగుతూ ఉండేవి. ఇదే విధంగా మంగళవారం కూడా గొడవ జరగటంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది." - మణికంఠ, మృతురాలి భర్త

"నేను పెళ్లి చేసుకోను.. ఐఏఎస్ చదువుతాను అని నా కూతురు చెప్పింది. అయితే మా వియ్యంకులు మేము చదివిస్తాం అని.. నా కూతురికి నచ్చజెప్పి గత సంవత్సరం ఏప్రిల్ నెల 15వ తేదీన తన కొడుకుకి ఇచ్చి పెళ్లి జరిపించారు. అనంతరం నా కూతురిని చదివించకుండా వంటింటికి పరిమితం చేసేశారు. నెల రోజుల వరకు నా కూతురిని అత్తింటివారు బాగానే చూసుకునేవారు. తర్వాత నుంచి నా కూతురికి బయటకు కనిపించని టార్చర్ చెయ్యటం మొదలు పెట్టేవారు. అందుకే నా కూతురు ఆత్మహత్య చేసుకుని చనిపోయింది." - రమా, మృతురాలి తల్లి

Last Updated : Apr 26, 2023, 5:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.