ETV Bharat / state

సింహాచలం ప్రధాన అర్చకుడి సస్పెన్షన్ ఉపసంహరణ - స్వరూపానందేంద్ర సరస్వతి వార్తలు

విశాఖ జిల్లా సింహాచలం దేవస్థానం అర్చకుడి సస్పెన్షన్ వివాదానికి తెరపడింది. స్వామీజీ చొరవతో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించి ప్రధాన అర్చకుడిపై సస్పెన్షన్​ను ఉపసంహరించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

Simhachalam issue
Simhachalam issue
author img

By

Published : May 1, 2020, 10:59 PM IST

Updated : May 2, 2020, 12:07 AM IST

సింహాచలం వివాదం సద్దుమణిగింది. విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి చొరవతో సమస్యకు తెర పడింది. ప్రధానార్చకుడు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులపై వేసిన సస్పెన్షన్ వేటును ఉపసంహరించింది ప్రభుత్వం. ఈమేరకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ జరిగింది...

లక్ష్మీ నరసింహ స్వామి కొలువుదీరిన విశాఖ జిల్లా సింహగిరిపై చందనోత్సవ వేళ నిబంధనలకు విరుద్ధంగా ఒక వ్యక్తిని అప్పన్న నిజరూప దర్శనానికి తీసుకువెళ్లినట్లు ప్రధాన అర్చకుడిపై ఆరోపణలు వచ్చాయి. దీనికి ప్రధానార్చకుడు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులే కారణమని సింహాచలం ఈవో భావించారు. అనుమతి లేని వ్యక్తి నిజరూప దర్శనానికి వెళ్లిన వివాదం మీడియాలో రావటంతో ప్రాథమిక సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ప్రధానార్చకుడిపై సస్పెన్షన్ వేటు వేశారు.

దీనిని వ్యతిరేకిస్తూ ప్రధానార్చకుడు తక్షణం విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్రను కలిశారు. తన తప్పేమీ లేదని వివరణ ఇచ్చారు. దీనిపై స్పందించిన స్వామి స్వరూపానందేంద్ర తక్షణం దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​తో మాట్లాడారు. ప్రాథమిక సమాచారాన్ని ఆధారంగా చేసుకుని సస్పెన్షన్ వేయడం సమంజసంగా లేదని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

ఇదీ చదవండి..

లాక్​డౌన్ 3.0: ఆ ప్రాంతాల్లో మద్యం అమ్మకాలకు ఓకే

Last Updated : May 2, 2020, 12:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.