ETV Bharat / state

'సమష్టి కృషితో కరోనాపై విజయం సాధించవచ్చు'

విశాఖ జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య తగ్గుతుందనుకున్న సమయంలో ఒక్కసారిగా కేసులు పెరగటం కలవరపెడుతోందని మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ప్రజల సమష్టి కృషితో కరోనాపై విజయం సాధించవచ్చని ధీమా వ్యక్తం చేశారు.

సమష్టి కృషితో కరోనాపై విజయం సాధించవచ్చు
సమష్టి కృషితో కరోనాపై విజయం సాధించవచ్చు
author img

By

Published : Apr 1, 2020, 6:54 PM IST

సమష్టి కృషితో కరోనాపై విజయం సాధించవచ్చు

సమష్టి కృషితో కరోనాపై విజయం సాధించవచ్చని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. విశాఖ జిల్లాలో లాక్​డౌన్ పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన...ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. విశాఖలో కరోనా బాధితుల సంఖ్య తగ్గుతుందనుకున్న సమయంలో ఒక్కసారిగా పెరగటం కొంత ఆందోళనకు గురి చేసిందన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో విదేశాల నుంచి వచ్చిన 196 మందిని గుర్తించి హోం క్వారంటైన్​కు తరలించామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చినవారు స్వచ్ఛందంగా వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. లాక్​డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరకులు అధిక ధరలకు విక్రయిస్తే వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా జిల్లాకు విడుదలైన 130 కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు.

ఇదీచదవండి

వారంతా స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలి: పెద్దిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.