ETV Bharat / state

నివర్ ఎఫెక్ట్: నష్టపోయిన రైతులకు వైఎస్సార్​ ఉచిత పంటల బీమా వర్తిస్తుందా..?

author img

By

Published : Nov 30, 2020, 6:40 PM IST

నివర్ తుపాను ప్రభావంతో పూర్తిగా నీట మునిగి, పాడైపోయిన వరి పంటకు వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం వర్తిస్తుందా ? లేదా ? అన్న విషయంలో బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుపాను, వరదల కారణంగా ఏ రైతు కైనా 33 శాతానికి పైగా పంట నష్టం వాటిల్లితే ఇన్​పుట్​ సబ్సిడీగా ఎకరాకు 6 వేల 500 చొప్పున ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన చేసింది. వాస్తవంగా చూస్తే వరి సాగు ఎకరానికి 25 వేల నుంచి 30 వేల వరకు పెట్టుబడి అవుతుంది. పంటల బీమా పథకం ప్రకారం చూస్తే ఎకరాకు 32వేల మేర పరిహారం అందించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇన్​పుట్​ సబ్సిడీ కింద ఆరున్నర వేల సాయం ప్రకటించడంతో బీమా పథకం పరిహారం అందుతుందా ? లేదా? అన్నది ప్రభుత్వం స్పష్టం చేయాలని రైతులు కోరుతున్నారు.

నష్టపోయిన రైతులకు వైయస్ఆర్ ఉచిత పంటల బీమా వర్తించనుందా

విశాఖ జిల్లాలో ఖరీఫ్ కు సంబంధించి 1లక్షా 2 వేల 740 హెక్టార్​లలో వరి సాగు చేశారు. సాగు చేసిన మొత్తం, విస్తీర్ణం, గ్రామాల వారీగా రైతులు భూముల సర్వే, నెంబర్ల వారీగా ఈ క్రాప్ నమోదు నమోదు చేసిన ప్రతి రైతుకు వైఎస్సార్​ ఉచిత పంటల బీమా పథకం వర్తిస్తుందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. భారీ వర్షాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలతో పాటు అనావృష్టి వల్ల పంట పూర్తిగా దెబ్బ తింటే బీమా పథకం కింద రైతులకు నష్టపరిహారం అందుతుంది. అయితే ప్రస్తుతం నివర్ తుపాన్ ప్రభావంతో నెలకొన్న పరిస్థితి వేరుగా ఉంది. కోతకు వచ్చిన వరి పంట భారీ వర్షాలకు వేలాది ఎకరాల్లో నీట మునిగింది. తమ పంటలకు నష్టపరిహారం అందుతుందో లేదోనని రైతులు పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి

జిల్లాలోని ఇరవై ఏడు మండలాల్లో 23 వేల మంది రైతులకు సంబంధించి 11 వేల 500 హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నట్లు తేలింది. వైఎస్సార్​ ఉచిత పంటల బీమా పథకం వర్తింపు పంటకోత ప్రయోగాలను అనుసంధానం చేశారు. జిల్లాలో 3800 ప్రయోగాలు చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఇప్పటివరకు 900 ప్రయోగాలు పూర్తిచేశారు. దీంట్లో 700 వరకు విశాఖ మన్యం, మిగిలిన 200 మైదాన ప్రాంతాల్లో చేపట్టారు. సాధారణంగా పంట కోత ప్రయోగం చేసిన 14 రోజుల్లో అంటే పనలు, కుప్పలు , నూర్చే సమయంలో తడిసిపోయిన నీరు ప్రవేశించిన ఇతరత్రా ప్రమాదం జరిగినా బీమా వర్తిస్తుంది. ఏజెన్సీలో పంట కోత ప్రయోగాలు పూర్తయిన వాటిలో వర్షాలకు దెబ్బతిన్న మండలాల్లో చింతపల్లి , కొయ్యూరు, గూడెంకొత్తవీధి తదితర మండలాలు ఉన్నాయి. మైదానంలో ప్రయోగాలు పూర్తిచేసిన మండలాల్లో వర్షం అధిక ప్రభావం చూపింది. పంట బాగా పండి చేతికి అందే సమయంలో దెబ్బతినడంతో నష్టాన్ని ఏ విధంగా అంచనా వేస్తారు ? అనేదానిపై రైతులు అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరికొన్ని చోట్ల వర్షం వల్ల మొలకెత్తిన ధాన్యాన్ని తీసుకుంటారా ? లేక మొత్తం నీటిలో మునిగిన పంటను తీసుకుంటారా ? అనేది వ్యవసాయ శాఖ స్పష్టం చేయాల్సి ఉంది. తక్షణమే సహాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చదవండి

కేంద్రం సూచనలతో వ్యాక్సిన్ పంపిణీపై అధికారుల కసరత్తు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.