లాక్‌డౌన్ తో ఆలయాలకు రాలేకపోతున్న భక్తులకు ఆన్ లైన్ లో పూజలు చేయించుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు. విశాఖలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనాలు నిలిపివేసిన నేపథ్యంలో.. భక్తులకు ఆన్ లైన్ లో ఆ అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఆన్‌లైన్‌లో నిర్ణీత రుసుము చెల్లిస్తే ఆ వ్యక్తుల పేరుతో పూజలు చేస్తామని దేవస్థానం ఈవో ఎస్‌జె. మాధవి ప్రకటించారు. అష్టోత్తర, కుంకుమ పూజకు రూ.50, క్షీరాభిషేకం రూ.200, పంచామృతాభిషేకానికి రూ.516 చొప్పున చెల్లించి గోత్ర, నామాలు తెలియజేస్తే చాలన్నారు. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఆంధ్రా బ్యాంకు అకౌంట్ నెంబరు 060810011006691, IFSC . ANDB000608 కు డిపాజిట్ చేసిన తర్వాత పూజ కార్యక్రమాల వివరాల కోసం 9550758133, 6302260299, నంబర్లకు ఫోనులో సంప్రదించాలని సూచించారు.
ఇదీ చూడండి: